యాడికి మండలంలో ఖనిజ నిక్షేపాల కోసం ఓఎన్జీసీ సిబ్బంది సర్వే పనులు చేపట్టారు. యాడికి, చందనరోడ్డు, గుత్తిరోడ్డు తదితర ప్రాంతాల్లో సర్వే పనులు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సర్వే పనులు చేపట్టినట్లు తెలిపారు. 30 నుంచి 35 మీటర్ల వరకు బోర్ ద్వారా తవ్వకం చేపట్టి మెటీరియల్ సేకరిస్తున్నారు. వీటిని ల్యాబ్‌కు పంపి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాంటి నిక్షేపాల నిలువలు ఉన్నాయో లేదో పరిశీలించనున్నారు.