గిరిజనులకు అనేక సంప్రదాయాలు, కళలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ‘అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి. స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తూ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాగలిగారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆఫ్రికా తర్వాత గిరిజనులు ఎక్కువగా ఉండేది భారత్‌లోనే. అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలనేదే నా ఆకాంక్ష.’ అని పేర్కొన్నారు.