యాడికి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వంతెన సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంకును గురువారం ఆర్డీఒ శ్రీనివాసులురెడ్డి పరిశీలించారు. పెట్రోల్ బంకు యజమానులు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలని చేసుకున్న దరఖాస్తును పరిశీలించి విచారణ నిమిత్తం యాడికికి వచ్చినట్లు తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంకు నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు.