శ్రావణ మాసంలో వచ్చిన తొలి పండుగ కావడంతో నాగ పంచమిని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పురాణాల్లో అపారమైన ప్రాముఖ్యతను కలిగిన పండుగ నాగ పంచమి. ఈ సందర్భంగా పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయావరణంలో గల నాగ దేవతలకు ప్రత్యేక పూజలు, పాలు పోసి మొక్కులు చెల్లించుకునేందుకు మహిళలు బారులు తీరారు. శ్రావణ పంచమి రోజున నాగ దేవతకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని అక్కడ ప్రజలు అన్నారు.