కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టీస్ (ఎంపిజె) నాయకులు కోరారు. ఈ మేరకు వారు గురువారం ప్రొద్దుటూరు స్థానిక పుట్టపర్తి సర్కిల్లో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఎంపిజె షేక్ సలీం, ఇన్సాఫ్ మాజీ కార్యదర్శి షరీఫ్, ఎంపిజె జిల్లా అధ్యక్షుడు జాకీర్ ఉమ్రి, పట్టణ అధ్యక్షుడు హుశేన్ బాషా, కార్యదర్శి మహమ్మద్ రఫీ, అస్లాం, కార్యకర్తలు పాల్గొన్నారు.