ఏపీ సీఎం చంద్రబాబు ప్రవర్తన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఆయన వ్యవహరించే తీరు ఒక సామాన్యుడిని తలపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు తన వ్యవహార శైలితో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న చేనేత దినోత్సవం రోజున ఎగ్జిబిషన్‌కు వెళ్లి అక్కడ అందరితో ఆయన మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ఆ తరువాత ప్రకాశం బ్యారేజ్‌పై సందర్శకులతో సరదాగా మాట్లాడి.. వారితో సెల్ఫీలు దిగారు. ఇవాళ ఆదివాసీలతో మాట్లాడి.. వారు తయారు చేసిన వస్తువులన్నింటినీ ఆసక్తిగా తిలకించారు. నృత్యం చేశారు.. డప్పు వాయించారు.. ఆ తరువాత ఆదివాసీలు తయారు చేసిన కాఫీని ఆయన తాగడమే కాదు.. అక్కడున్న అధికారులను పిలిచి మరీ తాగించారు.