స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈనెల 15వ తేదీన ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ పీవీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. తాడిపత్రి పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి 15 వరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపాలన్నారు.