తాడిపత్రి పట్టణంలోని నందలపాడులో ఉన్న కేజీబీవీ పాఠశాలను ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల గదులు, ఆవరణంలోని పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa