రాప్తాడు సీఐగా టి. వెంకట శ్రీహర్షను నియమిస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలోని డిసీఆర్ బీలో విధులు నిర్వహిస్తున్న వెంకట శ్రీహర్షను రాప్తాడుకు బదిలీ చేశారు. గతంలో శ్రీహర్ష నార్పల, పుట్లూరు, పెద్దపప్పూరు, బత్తలపల్లి, గార్లదిన్నె మండలాలలో ఎస్సైగా విధులు నిర్వహించారు. త్వరలోనే రాప్తాడులో సీఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు.