కనిగిరి పట్టణంలోని స్థానిక సాయిబాబా దేవస్థానంలో మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి భక్తులు కుంకుమార్చన పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa