విశాఖపట్నం లో వారం రోజుల వ్యవధిల్లో రెండు ఆస్పత్రుల్లో అగ్నిప్రమాద ఘటనలు జరుగడం పట్ల రోగులు కలవర పాటుకు గురవుతున్నారు. మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాద ఘటనను మరవకముందే ఆదివారం విశాఖ సెవెన్‌హిల్స్ ఆస్పత్రి ఐదో అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. దట్టంగా పొగలు అంటుకుని మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో ఆస్పత్రి సీఈవో గది పూర్తిగా దగ్ధమయ్యింది. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు.అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేశారని తెలిపారు. రోగులకు ఎలాంటి ముప్పులేదని ఆస్పత్రి యాజమాన్యం తెలిపిందని వివరించారు