రాష్ట్ర చరిత్రలోనే నీ పరిపాలనలో రైతులకు చీకటి రోజులు.. సిద్ధం ఫ్లెక్సీలు మీద చూపించిన శ్రద్ధ ఏనాడైనా రైతుల మీద చూపించావా జగన్ రైతులకు పథకాలు నిలిపేసి.. నీ దిష్టిబొమ్మ వేసిన పాస్ పుస్తకాలు, సమాధి రాళ్ల లాంటి సర్వే రాళ్లు పంపించావు.. కేవలం ఖరీఫ్ లో మాత్రమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి, రబీకి ఏ నాడూ ఒక్క రూపాయి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించకుండా రైతులను నట్టేట ముంచిన నీచమైన చరిత్ర నీది .అసమర్థ, అరాచక పరిపాలనలో, అసత్య ఆరోపణల్లో నువ్వు ఒక వర్గానికి ఆదర్శం .అధికారంలో ఉన్నప్పుడు పరదాలు అడ్డు పెట్టుకొని పోలీసు బలగాల మధ్య తిరిగిన నువ్వు ఒక్కసారైనా రైతుల మధ్యకు వెళ్లి ఉంటే ఖచ్చితంగా నీకు దేహ శుద్ధి చేసి ఉండేవారు.. పంటల బీమా, విత్తనాలు, ఎరువులు, రాయితీపై బిందు సేద్యం, రాయితీపై యంత్రపరికరాలు, ఉద్యాన పంటల రాయితీ.. వీటిలో ఒక్కటైనా రైతులకు అందించావా... సిగ్గు లేకుండా రాష్ట్రం నుంచి పారిపోయి రాజకీయ డ్రామాలు మొదలు పెట్టావు.. అసెంబ్లీ సమావేశాలకు వస్తే నీ చేతకానితనం స్పష్టంగా నీకు తెలుస్తుంది. అన్నీ లెక్కలతో సహా వివరిస్తాం.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 2,384 కోట్ల బకాయిలు పెట్టావు. వ్యవసాయానికి తోడ్పాటు అందించే బిందు సేద్యం అమలు చేయకుండా కంపెనీలకు 1167 కోట్ల, ధాన్యం బకాయిలు రూ.1600 కోట్లు పెట్టి అన్నదాతలను ఇబ్బందులు పెట్టావు.. కౌలు రైతులకు, మత్స్యకారులను నీర్వీర్యం చేసే పనికిమాలిన చట్టాలు తెచ్చావు.. ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి అసలు గిట్టుబాటు ధరే లేకుండా చేశావు.. నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రూ.3లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తే నువ్వు వచ్చి దాన్ని లక్షకి పరిమితం చేసావ్.. రాష్ట్రంలో ఒక్కో రైతు నెత్తిన రూ 2.75 లక్షల అప్పు మోపిన నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది..