ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై చర్చించడానికి టీచర్ ల సంఘాలతో ఆదివారం టీడీపీ ఎమ్మెల్సీలు ఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించడంలో ఆంతర్యం ఏంటని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ ప్రశ్నించారు. ఈ మేరకు అనంతపురంలో విజయ్ మాట్లాడుతూ ఈ సమావేశం అధికారిక సమావేశమా లేక అనధికారిక సమావేశమా అనే విషయం ప్రకటించాలని అన్నారు.