కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల పేరును మారుస్తున్నట్లు సమాచారం. సచివాలయాలను సంక్షేమ కార్యాలయాలుగా మార్పు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ సంక్షేమ కార్యాలయంలో ద్వారానే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించాలని యోచిస్తోంది. వచ్చేనెల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం.