ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో కిసాన్ మోర్చ నాయకులు పివివి ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం జరిగింది. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఉప్పాడ అప్పారావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోడీ సూచనల మేరకు ఈ నెల 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామానాయుడు, బోర శ్రీను, తదితరులు పాల్గొన్నారు.