వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా క్షణానికో మలుపు తిరుగుతోంది. తాజా అప్డేట్ ఏంటంటే.. దువ్వాడతో సంబంధం పెట్టుకుందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పలాస జాతీయ రహదారిపై దివ్వెల మాధురి రోడ్ యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిందే. యాక్సిడెంట్లో ఆమె కారు నుజ్జు నుజ్జు అయ్యింది. తను కావాలనే ఆత్మహత్య యత్నంలో భాగంగా యాక్సిడెంట్ చేశానని మాధురి చెబుతున్నారు. నెగ్లిజన్స్తో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించే చట్టం ప్రకారం ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. నూతన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం కేసు నమోదైంది.