మదనపల్లె ఫైళ్ల దగ్థం కేసు విచారణ వేగంగా జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏపీ వ్యాప్తంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులున్నారని ఆరోపించారు. తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో భూములకు సంబంధించిన వందల ఫైళ్లు దొరికాయని అన్నారు. మదనపల్లె ఫైళ్ల దగ్థం కేసులో ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పెద్దిరెడ్డి బాధితులు వేలసంఖ్యలో ఉన్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పెద్దిరెడ్డి కుటుంబం వందల ఎకరాల భూకబ్జాలకు పాల్పడినట్లు ఆధారాలున్నాయని వెల్లడించారు. తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గంలో అధిక సంఖ్యలో బాధితులు ఉన్నారని చెప్పారు. వైసీపీ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలను బయటపెడతామని స్పష్టంచేశారు. ప్రజాధనాన్నివైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.