ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 13తో ముగియనుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీకి కూటమి రెడీగా ఉంది. బైరా దిలీప్ చక్రవర్తి పేరు తెర పైకి వచ్చింది. ఈరోజు అభ్యర్థి పేరును కూటమి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవపు వైసీపీ అధిష్టానం ఇప్పటికే తమ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.