ఏలూరు నగరంలో ట్రాఫిక్ సమస్య జఠిలమైంది. నగర ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల వారు ట్రాఫిక్‌తో హడలిపోతున్నారు. నిత్యం వందలాది భారీ వాహనాలు, వేలాది ద్విచక్ర వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. నగరంలో భారీ వాహనాలకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ప్రవేశం లేదు. రోజంతా భారీ వాహనాలు యథేచ్ఛగా రాకపోకలు సాగించడంతో సమస్య తీవ్రమవుతోంది.