సెబీ చీఫ్ మాధబి పురి బచ్, ఆమె భర్త వాటాలు కొనుగోలు చేశారంటూ హిండెన్ బర్గ్ విడుదల చేసిన నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సెబీ సమగ్రత ఆ సంస్థ చైర్‌పర్సన్‌పై వచ్చిన ఆరోపణలతో తీవ్రంగా రాజీపడిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. ఆమె వాటాలు కొనుగోలు చేసినట్లు వెల్లడైందని, కానీ ఇప్పటికీ ఆమె రాజీనామా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.