ఏలూరు జిల్లాలో రాత్రి 11 గంటల కల్లా వ్యాపారాలు ముగించాల్సిందేనని జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ హెచ్చరించారు. ఎటువంటి కారణాలు లేకుండా రాత్రి వేళ వీధుల్లో సంచరిస్తే అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. రాత్రి 11 గంటలకు దుకాణాలన్నీ మూసివేయాలని, ఎవరైనా 11 గంటలు దాటిన తర్వాత వ్యాపారులు కొనసాగిస్తే సహిం చేది లేదన్నారు. వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. రాత్రివేళ జిల్లాలో గస్తీ ముమ్మరం చేస్తు న్నామని పోలీస్ పెట్రోలింగ్ మరింత కట్టుదిట్టంగా నిర్వ హించాలని సంబంధిత పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, ముఖ్య కూడళ్ళల్లో వ్యాపారాలు నిర్వహించే టిఫిన్, పాన్‌షాపులు, చిరు వ్యాపారులను కట్టడి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణ మవుతున్న వాహనదారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశిం చారు. ఎస్పీ ఆదేశాలతో జిల్లాలోని పోలీస్ యంత్రాంగం ఆదివారం రాత్రి 11 గంటల నుంచే రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.