మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యభిచారులు, హంతకులకు నాయకుడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు. జగన్ రెడ్డి అరాచకం ముందు ఫ్యాబ్లో ఎస్కోబార్ కూడా ఎందుకు పనికి రాడని విమర్శించారు. అంబేద్కరిజంపై దాడి చేసిన ద్రోహి జగన్ రెడ్డి అని ఆక్షేపించారు. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుల పేర్లు అంబేద్కర్ కాళ్లకింద ఉండటానికి కూడా దళిత సమాజం ఓప్పుకోవడంలేదని అన్నారు. అందుకే ఎవరో జగన్ రెడ్డి పేరును తొలగించారని చెప్పారు. పేరు తొలగింపునపై జగన్ &కో ఫేక్ ప్రచారం మొదలు పెట్టారని విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు, మంత్రి నారా లోకేష్‌లపై విష ప్రచారం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇలా పేర్ల తొలగింపును తాను ఖడిస్తున్నానని అన్నారు. కాని ఒక దళిత బిడ్డగా దళితులకు ద్రోహం చేసిన జగన్ పేరు తొలగించడాన్ని తాను మద్దతిస్తున్నానని మహాసేన రాజేష్ తెలిపారు.