రేపు తుంగభద్ర జలాశయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సందర్శించనున్నారు. నీటి ఉధృతికి కొట్టుకపోయిన గేటు కోసం డ్యామ్ పరిసరాల్లో గజ ఈత గాళ్లతో వెదికిస్తున్నారు. టీబీ బోర్డు అధికారులు కొత్త గేట్లను తయారు చేయిస్తున్నారు. గేట్లను అమర్చడంలో నిపుణులైన కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో నారాయణ ఇంజనీరింగ్, హిందుస్థాన్ కంపెనీలు ప్రతినిధులు మరమ్మతు పనులు చేయించారు. వరద పెరిగిన కారణంగా జిల్లా పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు కలెక్టర్ ఇంతియాజ్ బాషా సూచించారు.