ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే పంద్రాగస్టు వేడుకలకు కుప్పం మహిళా రైతు ఎన్.మునిలక్ష్మి అతిథిగా హాజరు కానున్నారు. కుప్పం మండలం వెండుగంపల్లెకు చెందిన ఈమె పీఎం కిసాన్ పథకం లబ్ధిదారు. తన భర్త నారాయణతో కలిసి గ్రామంలో ఆమె ఆదర్శ వ్యవసాయం చేస్తున్నారు. కాగా, ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దిన వేడుకలకు రాష్ట్రం నుంచి పీఎం కిసాన్ లబ్ధిదారులైన నలుగురు రైతులను అతిథులుగా ఎంపిక చేశారు. వీరిలో చిత్తూరు ఉమ్మడి జిల్లా నుంచి మునిలక్ష్మి ఉన్నారు. మిగిలిన వారు.. పోతుల నాగమణి (ఏలూరు), దోమ మోహన్ (శ్రీకాకుళం), నల్లపు మాల్యాద్రి (ప్రకాశం). కాగా ఎన్.మునిలక్ష్మి దంపతులు ఆదివారం సాయంత్రం కుప్పంనుంచి విజయవాడ బయలుదేరి వెళ్లారు. అక్కడ్నుంచి దురంతో ఎక్స్‌ప్రె్‌సలో బయలుదేరి న్యూఢిల్లీ చేరుకుంటారు. ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దిన వేడుకల్లో అతిథిగా పాల్గొంటారు. మునిలక్ష్మి దంపతులకు టీడీపీ కుప్పం మండల అధ్యక్షుడు మల్లానూరు ప్రేమ్‌కుమార్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.