చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని సోమవారం నుంచి 15వ తేదీ వరకు నిర్వహించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు జాతీయ జెండాలతో సెల్ఫీ తీసుకుని జ్చిటజజ్చిట్టజీట్చుఽజ్చ.ఛిౌఝ లింక్ ద్వారా పోస్టుచేయాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో దేశభక్తిని ప్రబోధించే పాటలు, నాటకాలు, ఏకపాత్రాభినయం తదితర కార్యక్రమాలను నిర్వహించాలని డీఈవో, ఆర్‌ఐవో, డీవీఈవోను ఆదేశించారు. 13న డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీలు.. డీఎస్డీవో, ఆర్‌ఐవో, డీఈవోల సమన్వయంతో బిగ్ రన్ మారథాన్.. ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో జాతీయ జెండా ఎగురవేయాలని పేర్కొన్నారు. 14న మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ.. స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులను సన్మానించాలని తెలిపారు. 15న జాతీయ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని సూచించారు.