ఆలయ భూములు పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. రూ.50వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఆర్థిక సాయం పెంచుతున్నట్లు ప్రకటించారు. తిరుమల నుంచే దేవాదాయ శాఖలో ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఐదుగురు దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. మరో వివాదాస్పద అధికారిపై విచారణ చేపడతామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.