సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా ఎం. నాగేశ్వర్ రావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ అనేక మలుపులు తిరుగుతున్నది. ఈ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పక్కకు జరిగారు. నూతన సీబీఐ డైరెక్టర్ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నందునే ఆయన కేసు నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. నాగేశ్వర్ రావు తన సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడంతో ముందస్తుగా రమణ ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఈ కేసు విషయమై జస్టిస్ రమణ మాట్లాడుతూ, నాగేశ్వర్ రావు నా సొంత రాష్ట్రానికి చెందిన వారు. ఆయన కుమార్తె వివాహానికి కూడా నేను వెళ్లాను. అని తెలిపారు. అందుకే తప్పుకున్నాను అని వివరించారు. ఇంతకు ముందు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఏకే సిక్రీ వేర్వేరు కారణాలతో ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.