కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునర్ సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లపై వచ్చే నెల 6న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, ఎఎం ఖన్విల్కర్, డివై చంద్రచూడ్, ఇందు మల్హోత్రాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్‌లపై విచారణ చేపట్టనుందని అత్యున్నత న్యాయస్థానం వెబ్‌సైట్‌లో పేర్కొంది. లింగ వివక్షతకు తావునివ్వకూడదంటూ, అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 28న అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4: 1 నిష్పత్తిలో తీర్పు వెల్లడించింది.