పొత్తులపై మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని సెలవిచ్చారు. పవన్‌తో పొత్తు విషయం తనక తెలియదన్నారు. పొత్తుల విషయంలో ఎవరైనా తమతో కలవొచ్చని చెప్పారు. అయినా ఆఖరి నిమిషం వరకు ఏదయినా జరగొచ్చని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దీక్షలు చేయడం వల్ల ఉపయోగం లేదని, ఏదో ప్రయత్నం చేయాలి కనుక చంద్రబాబు దీక్ష చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీలో చేరికపై జేసీ స్పందించారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు ఇప్పుడు ఏమీ లేవని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కియ పరిశ్రమను గుజరాత్‌కు తరలించాలని నాలుగు సార్లు ప్రయత్నం చేశారని జేసీ ఆరోపించారు.