ఇప్పటి వరకు వినియోగదారులకు అందిస్తున్న అదనపు డేటాను ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. ఎంపిక చేసిన ఫ్రీ పెయిడ్ రీఛార్జీలో ఈ ఆఫర్ అమలులో ఉన్నది. ప్రస్తుతం ఈ ప్లాన్ లో రోజుకు 2.2 జీబీ చొప్పున డేటాను అందిస్తున్నారు. ఈ అదనపు డాటా ఆఫర్ రూ.186, రూ.429, రూ.485, రూ.666, రూ. 999 ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్‌పై, రూ.187, రూ.333, రూ.349, రూ.444, రూ. 448 ప్రీపెయిడ్ ఎస్టీవీ రీఛార్జ్ పై అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. బీఎస్ఎన్ఎల్ తో పాటు వొడాఫోన్-ఐడియా కూడా సరికొత్త ప్లాన్ ప్రకటించింది. ఒక్కాసారి రూ.154తో రీఛార్జ్ చేసుకుంటే 600 నిమిషాల లోకల్ వాయిస్ కాల్స్‌ను ఆరు నెలలు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఇతర నెట్‌వర్క్ లోకల్, నేషనల్ కాల్ అయితే సెకన్‌కు 2.5 పైసలు, 10కేబీ డాటాకి 4పైసలు, లోకల్ ఎస్‌ఎంఎస్‌కి రూ.1, నేషనల్ ఎస్‌ఎంఎస్‌కైతే రూ. 1.5గా కంపెనీ రేట్లు ఖరారు చేసింది.