బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నాయీ బ్రాహ్మణులకు, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్‌కు ఆమోదం తెలిపింది. అలాగే ఏలూరులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. కాలేజీ కోసం మూడేళ్లలో రూ. 260 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లును అడాప్ట్ చేసుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 10 శాతం రిజర్వేషన్‌లో 5 శాతం కాపులకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.