3 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 9న నెల్లూరులో భారీగా సామూహిక గృహప్రవేశాలను పండుగగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే విశాఖ జిల్లా ఆనందపురం మండలం డిడిజాల పరిధిలో భారత మహిళా ఔత్సాహిక పారిశ్రామిక సంఘాలకు 55 ఎకరాలు కేటాయించింది. జయహో బీసీ సభ హామీలపై కేబినెట్ కసరత్తు చేసింది. కియా మోటార్స్ తొలికారు విడుదలపై కూడా కేబినెట్‌లో చర్చించారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖను సీఎం చంద్రబాబు అభినందించారు. అభినందనలను మంత్రిమండలిలో రికార్డు చేయాలని సీఎస్‌కు ఆదేశించారు. అమరావతి మోడల్‌లో కొచ్చిన్ టౌన్ షిప్ అభివృద్ధి చేస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించడంపై మంత్రివర్గంలో చర్చించారు. అమరావతి నిర్మాణ ప్రగతికి ఇదే నిదర్శనమని సీఎం తెలిపారు.