తుంగభద్ర జలాశయంలో స్టాప్‌లాగ్‌ను ఏర్పాటు చేసి ఇంజనీరింగ్ చరిత్రలోనే అద్భుతం సృష్టించబోతున్నాం అని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అయన మాట్లాడుతూ... వేగంగా, ఉధృతంగా ప్రవహిస్తున్న నీటికి అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ ప్రక్రియలో సాంకేతికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పూర్తిస్థాయిలో నీటిని కాపాడుకునే బాధ్యతను ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించాము. రాజకీయంగా ఎలాంటి జోక్యం ఉండదు. సీడబ్ల్యూసీ గైడెన్స ప్రకారం ఇంజనీర్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరువుసీమ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ఉన్న ఏకైక ప్రాజెక్ట్ తుంగభద్ర. వీలైనంత త్వరగా పనులు ముగించి ఈ సంక్షోభం నుంచి గట్టెక్కుతాం అని అన్నారు.