హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం బెల్లం వినాయకున్ని, సంపత్ వినాయకున్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రిని మీడియా పలుకరించగా.. కర్నూలు టీడీపీ నేత శ్రీను హత్యపై స్పందించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు రాజకీయ హత్యలు జరిగాయని, అందులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలు హత్యకు గురయ్యారని, అనాగరికంగా హత్య చేశారని అన్నారు. కర్నూలు ఎస్పీతో ఫోన్లో మాట్లాడానని, నిందితుల్ని పట్టుకుని చట్ట ప్రకారం శిక్షింస్తామని చెప్పారు.