సెబి అదానీ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అదానికి ఇనుప కవచంలా మోదీ ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. మోదీ వచ్చాక వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి అహంభావం పెరిగిపోయిందని... ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా చర్యలు చేపట్టారన్నారు. ఎవరినైతే జైల్‌లో పెట్టారో వారే బంగ్లాదేశ్‌కు ప్రధాని అయ్యారన్నారు. హిందువులపై దాడులు చేస్తున్న వీడియోలు పెట్టి బీజేపీ పెద్ద యెత్తున ప్రచారం చేస్తున్నారన్నారు. వయనాడ్‌లో బాధితులను ఆదుకునేందుకు సీపీఐ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. పార్టీ తరుపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గవర్నర్ జోక్యాన్ని ఖండిస్తున్నామన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్‌లో ఉన్నందున మరొకరికి వేడుకల బాధ్యతలు అప్పగించారన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని అడ్డుకోవడం సరికాదన్నారు.