ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం కుంటుపడే పరిస్థితికి వచ్చింది : వైయస్ షర్మిల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2024, 06:50 PM

దివంగత నేత శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలో కుంటుపడే పరిస్థితికి వచ్చింది.పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ పథకం ఆపివేస్తున్నామని ఆసుపత్రుల నిర్వాహకులు అల్టిమేటం ఇచ్చారు. దీనిపై కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చంద్రబాబు గొప్పు గొప్పలు చెప్పారు కదా. ఇప్పుడేమో ఆరోగ్య శ్రీ కి బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంటే ఎలా ఆరోగ్య శ్రీ పథకాన్ని జగన్ సైతం నిర్వీర్యం చేశారు. జగన్ హయాంలో దాదాపు రూ.1600 కోట్లు పెండింగ్ లో పెట్టారు. గత 11 నెలలుగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు.పేదల కోసం YSR ప్రవేశ పెట్టిన పథకం ఆరోగ్య శ్రీ. ఈ పథకం వైద్యవిధానంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే 25 మంది ఎంపీలు బీజేపీకి ఎందుకు ఊడిగం చేస్తున్నట్లు . మీ మద్దతుతోనే కదా మోడీ గద్దెను ఎక్కింది . నిధులు కావాలని వెంటనే డిమాండ్ చేయండి. తక్షణమే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవండి. వీలైనంత వరకు పెండింగ్ బిల్స్ చెల్లించడండి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం.చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ అని ఊరూ వాడా ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఒక్క సిక్స్ కూడా అమలుచేయలేదు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు పథకం, రైతు భరోసా, పంట నష్టం పరిహారం ఎప్పటిలోగా అమలు చేస్తారో ప్రజలకు వివరణ ఇవ్వాలి. మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇచ్చినట్లుగా అమలు చేయాలి.లేని పక్షంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com