ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నాను. “ప్రజాదర్బార్” కు వచ్చే విన్నపాలను సంబంధిత శాఖలకు పంపి సత్వర పరిష్కారానికి కృషిచేయాలని సిబ్బందిని ఆదేశించాను. ఉండవల్లిలోని నివాసంలో 26వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. తమ కష్టాలను విన్నవించారు. భూఆక్రమణ సమస్యలపై బాధితుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండడంతో సంబంధిత శాఖతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశాను. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “హర్ ఘర్ తిరంగా” 3.0 కార్యక్రమంలో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి పంపిన లేఖను, జాతీయ జెండాను మంగళగిరి సబ్ డివిజన్ పోస్టాఫీస్ అసిస్టెంట్ సూపరిండెంట్ ఆర్.రాధాకృష్ణమూర్తి నాకు అందజేశారు.