గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్‌కు ప్రపంచ శాంతి సభకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సహా 18 పార్టీలు మద్దతిచ్చాయని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్‌కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారన్నారు. అక్టోబర్ రెండో తేదీన లాస్ ఎంజెల్సులో గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ జరుపుతున్నామన్నారు. ఈ సమావేశానికి మద్దతివ్వాల్సిందిగా సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాలూ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు.ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోతున్నానని చంద్రబాబు కూడా బాధ పడ్డారన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని వెల్లడించారు. రాష్ట్రం కోసం చంద్రబాబుతో కలిసి పని చేయడానికి తాను సిద్దంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్‌కు వస్తే అనేక మంది పారిశ్రామిక వేత్తలను కలిపిస్తానన్నారు. రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి చంద్రబాబుకు సహకరిస్తానన్నారు. వివిధ దేశాల కౌన్సిల్ జనరల్సుతో చంద్రబాబు భేటీ అవుతున్నా.. ఉపయోగం లేదని తెలిపారు.