• ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలను ఈ-సబ్ సెంటర్లుగా మార్చడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తద్వారా వైద్య, ఆరోగ్య సేవల్లో మరింత నాణ్యత పెరుగుతుంది.
• మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో టెలీ మెడిసిన్ ద్వారా సబ్ సెంటర్లలో చికిత్స మరింత చేరువయ్యే అవకాశం ఉంటుంది.
• ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సబ్ సెంటర్ల స్థాయిని మరింత పెంచుతాం. ఈ ప్రక్రియను 3 దశల్లో పూర్తి చేస్తారు.
• తొలిదశలో భాగంగా తూర్పుగోదావరి, విజయనగరం, గుంటూరులో ప్రారంభిస్తారు. మిగిలినవి రెండు దశల్లో చేపడతారు. రాష్ట్రంలో ఆరోగ్య శాఖను బలోపేతం చేయడమే దీని లక్ష్యం.