ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఎంసీ పెన్షనర్లకు ఆన్‌లైన్ చెల్లింపులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 01, 2019, 02:31 AM

•  ఏపీ మార్కెట్ కమిటీ ఎంప్లాయిస్ (పెన్షన్, గ్రాట్యుటీ) నిబంధనలు -1980 సవరణను మంత్రిమండలి ఆమోదించింది. దీని ప్రకారం ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సీఎంఎఫ్ (సెంట్రల్ మార్కెటింగ్ ఫండ్) సర్వీసు పెన్షనర్లకు ఆన్ లైన్ ద్వారా పింఛన్లు చెల్లించేలా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ రూపొందిస్తారు. 


•  పెన్షన్లు, జీతాలు చెల్లింపుల సందర్భంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సమయానికి నిధులు లేకపోవడం, నిధులు వచ్చినప్పుడు ప్రాధాన్యత క్రమంలో వాటిని చెల్లించకపోవడం, నేరుగా చెల్లింపు సమయంలో కొన్ని సమస్యలు తలెత్తడం వల్ల పెన్షన్లు, జీతాల చెల్లింపులు కష్టసాధ్యం అవుతోంది. 


•  ఇలాంటి సమస్యలపై సకాలంలో స్పందించి ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపేందుకు ఈ సాప్ట్‌వేర్ ఉపయోగపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa