• జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు 2 ఎకరాలు. (60 ఏళ్ల లీజు). ఎకరానికి రూ.కోటి. ఏటా చదరపు అడుగుకు రూ.1.00 నామమాత్రపు అద్దె.
• క్రాఫ్టు కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చ.మీ ఒక్కింటికి రూపాయి చొప్పున నామమాత్రపు ధరపై ఎకరం కేటాయింపు.
• యంగ్‌మెన్ క్రిస్టియన్స్ అసోసియేషన్ (YMCA) ఎకరాకు రూ. 50 లక్షల మార్కెట్ ధరకు 2.65 ఎకరాల కేటాయింపు.
ఇతర సంస్థలకు భూములు :
• మంత్రుల బృందం సిఫారసులకు అనుగుణంగా CRDA రీజియన్‌లో రామకృష్ణ మిషన్, జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలకు 25 ఎకరాల భూమి కేటాయింపు.
అమరావతి రైతులకు అభినందిస్తూ మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు :
• హైదరాబాదులో భూములు ఉన్నాయి కాబట్టే అక్కడ అభివృద్ధి సాధ్యం అయ్యింది. అమరావతిలో రైతులు చొరవ తీసుకుని భూములు ఇవ్వడం వల్ల ఇక్కడ అభివృద్ధి చేయగలుగుతున్నాం. రైతులకు ప్లాట్లు ఇవ్వడం, ఇతర ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా అటు రైతులకు,ఇటు ప్రభుత్వానికి లబ్ది చేకూర్చాం. ఇదొక చారిత్రాత్మక విజయం. ప్రపంచ చరిత్రలో ఇలాంటి వినూత్న కార్యక్రమం జరగలేదు. 34వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ దేశంలో ఎక్కడా జరగలేదు. మేము నిధులు ఇవ్వకపోయినా అభివృద్ధి ఎలా సాధ్యం అవుతోందని కేంద్రంలో బీజేపీ నేతలు ఏడుస్తున్నారు, చేష్టలుడిగి చూస్తున్నారు.
• వేలాది పేద కుటుంబాల నివాసాల కోసం 500 ఎకరాల భూమిని కేటాయించాం. రైతులకు ప్లాట్లతో పాటు పదేళ్లపాటు కౌలు ఇస్తున్నాం. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయానికి 5 టవర్లు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల నివాసాలు, పేదల నివాసాలు నిర్మాణంలో ఉన్నాయి. యూనివర్సిటీలు, వైద్యశాలలు, పరిశోధనా సంస్థలకు భూములిచ్చాం. ప్రైవేటు హోటళ్లకు కూడా కేటాయించాం.
• అమరావతి మోడల్‌లో కొచ్చిన్ టౌన్‌షిప్ అభివృద్ధి చేస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించడం మన రాజధాని నిర్మాణ ప్రగతికి, వినూత్న నమూనాకు నిదర్శనం. మన నరేగా కన్వర్జెన్స్, మన ల్యాండ్ పూలింగ్, మన అభివృద్ధి, నమూనాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం కావడం అందరికీ గర్వకారణం