• అమరావతి కోసం సమగ్ర ఆర్ధిక ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం. రాజధాని అమరావతి కోసం రూ.55,343 కోట్లతో అమలుచేసే సమగ్ర ఆర్ధిక ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం. ఇందులోనే రూ.51,687 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ కేపెక్స్. నిర్మాణ సమయంలో వడ్డీ (interest during Construction..IDC) రూ.3,656 కోట్లు. ఈ వ్యయంలో రూ. 37,112 కోట్లు ఆర్ధిక సంస్థలు, వాణిజ్య బ్యాంకుల ద్వారా సేకరణకు సీఆర్డీఏకు అధికారం.
• కొన్ని ప్రాజెక్టు ఆస్తులు తనఖాపెట్టి రుణాలు తెచ్చే సీఆర్డీఏ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం. పబ్లిక్ బాండ్స్ ద్వారా రూ.500 కోట్ల సేకరణ. పబ్లిక్ ఇస్యూ సందర్భంలో వడ్డీ చెల్లింపునకు ప్రభుత్వ గ్యారంటీ.
రాజధాని మౌలిక సదుపాయాలకు రుణం :
• రాజధాని అమరావతి సుస్థిర మౌలిక సదుపాయాలు, సంస్థాగత అభివృద్ధి పథకానికి (ASIDP) మంత్రిమండలి ఆమోదం.
• పథకం విలువ మొత్తం EAP రుణ మొత్తం 715 మిలియన్ల అమెరికన్ డాలర్లు.
• 500 మిలియన్ అమెరికన్ డాలర్లకు ప్రపంచ బ్యాంకు, AIIB ఫైనాన్స్.
• రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 215 మిలియన్ డాలర్లు.
• ఏపీ సీఆర్డీఏ ద్వారా ఈ పథకం అమలు.
రాజధాని నిర్మాణాలకు రూ.4900 కోట్ల నిధుల సమీకరణ :
• రాజధాని అమరావతిలో సచివాలయం, హెచ్ ఓడీల కార్యాలయాల నిర్మాణానికి రూ.4900 కోట్ల నిధుల సమీకరణ. సీఆర్డీఏకు మంత్రిమండలి అనుమతి.
• భారత ప్రభుత్వం/ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రాంట్ 20%. మిగిలిన 80% హడ్కో, వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకునే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
సంస్థలకు భూములు:
• రాజధాని అమరావతిలో 7 సంస్థలకు భూకేటాయింపులకు మంత్రిమండలి ఆమోదం. డా.ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి రాజధానిలో ఎకరా ఒక్కింటికి రూ.50 లక్షలు చెల్లించే షరతుపై 25 ఎకరాల కేటాయింపు.