• దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘భూధార్’ ప్రాజెక్టుకు చట్టబద్దత కల్పించేందుకు అవసరమైన సవరణ బిల్లు ముసాయిదాకు మంత్రిమండలి ఆమోదం.
• వ్యక్తులకు ఆధార్ తరహాలో భూ స్థిరాస్థులకు కూడా 11 అంకెల ప్రత్యేక సంఖ్యతో కూడిన కార్డును అందించేందుకు ‘భూధార్’ ప్రాజెక్టును తీసుకొచ్చారు.
• అవకతవకలకు తావులేని విధంగా భూ క్రయ విక్రయాలను పారదర్శకంగా జరుపుకునేందుకు ‘భూధార్’ ప్రవేశపెట్టారు.
• ఐతే, ‘భూధార్’కు చట్టబద్దత కల్పించడానికి వీలుగా రిజిస్ట్రేషన్ చట్టం-1908లో అవసరమైన సబ్ సెక్షన్లను చేర్చి చట్టాన్ని సవరించాలని అధికారులు ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
• రిజిస్ట్రేషన్ (ఆంధ్రప్రదేశ్ అమెండ్‌మెంట్) బిల్-2018 పేరుతో ప్రస్తుత శాసనసభ సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెడతారు