పెట్రోల్, డీజిల్ ధరల ఎక్సైజ్ డ్యూటీ నుంచి 2 శాతం పన్ను తగ్గిస్తూ లోగడ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వ్యాట్ చట్టంలో సవరణల్ని ప్రతిపాదిస్తూ రూపొందించిన బిల్లు ముసాయిదాకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
• ‘ఆంధ్రప్రదేశ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (అమెండ్‌మెంట్) బిల్-2019’ పేరుతో ప్రస్తుత శాసనసభ సమావేశాలలో దీనిని ప్రవేశపెడతారు.
• బిల్లు సభ ఆమోదం పొందితే వ్యాట్ అమలు 2018 సెప్టెంబరు నుంచి జరుగుతుంది.
• రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్గించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రభుత్వం ఏటా రూ.1120 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది.
• రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు సంబంధించి ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ నుంచి 2 శాతం మేర పన్నును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
• రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.