బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి కూడా ప్రజలెవ్వరికీ చెప్పకుండా వారం రోజులు విదేశాలకు చెక్కేశావ్. మేం ప్రశ్నిస్తే కాని నువ్వు బయటపెట్టలేదు. నువ్వు ఓపెన్‌బుక్ అయితే నీ టూర్ షెడ్యూల్ అధికారికంగా ఎందుకు విడుదల చేయలేదు.నీకోసం ఆగస్టు2న జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని ఎందుకు ఆగస్టు 7కు వాయిదా వేయించావు ఇన్నిరోజులపాటు ఆ టూర్ సమాచారాన్ని ఎందుకు దాచావ్.ఎక్కడకు వెళ్లావో నిర్భయంగా చెప్పొచ్చుగా ఇక్కడే అర్థం అవుతోంది ఫేక్ ఎవరో.అదే వైయస్ జగన్మోహన్రెడ్డి గారు అన్ని అనుమతులు తీసుకుని తన కుమార్తెలను చూడ్డానికి వెళ్తే నీ మనుషుల ద్వారా నానా యాగీ చేయించావ్.ఫేక్ కథనాలు రాయించి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి నిరంతరం ప్రయత్నించావ్. మరో విషయం ఏంటంటే… నీది రెడ్‌బుక్ అంటున్నావ్. అంటే రాష్ట్రంలో జరిగిన హత్యలకు, దౌర్జన్యాలకు, దాడులకు బాధ్యుడివి నీవేనని ఒప్పకున్నట్టేగా.మేం చెప్పేది కూడా అదే. రాష్ట్రంలో నడుస్తున్నది రెడ్‌బుక్ రాజ్యాంగం అని..లా అండ్ ఆర్డర్ లేనేలేదని.