దేశవిముక్తి కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. వారిని గౌరవించడం ఆనవాయితీగా వస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా దేశ మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికైన జవహర్లాల్ నెహ్రూ ట్రైస్ట్ విత్ డెస్టినీ అంటూ తన ఐకానిక్ ప్రసంగాన్ని అందించి.. ఢిల్లీలోని ఎర్రకోటపై భారతీయ జెండాను ఎగురవేశారు. ఈ సంప్రదాయాన్ని ప్రతి ప్రధానమంత్రి స్వాతంత్య్ర దినోత్సవం నాడు కొనసాగిస్తున్నారు.