ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త థార్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 5 డోర్ థార్ రాక్స్‌ను లాంచ్ చేసింది. పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లలో విడుదల చేసింది. పెట్రోల్ వేరియంట్ ధర రూ.12.99 లక్షల(ఎక్స్-షోరూమ్), డీజిల్ వెర్షన్ రూ.13.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుందని కంపెనీ వెల్లడించింది. రెండు ఇంజిన్లు సిక్స్ స్పీడ్ మాన్యువల్, ఆటో మెటిక్ గేర్ బాక్స్‌తో వస్తున్నాయి.