శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నా ఇంకా కచ్చితమైన హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ అందుబాటులోకి రాలేదని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. ‘‘వయనాడ్ విపత్తు కారణంగా మనం ఇవాళ బాధతో స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఈ బాధ మన ఒక్కరిదే కాదు.. దేశం మొత్తం పంచుకుంటోంది. దీంతో కుంగిపోవద్దు.. అంతా కలిసి రాష్ట్రాన్ని మళ్లీ పుంజుకునేలా చేయాలి’’ అని పేర్కొన్నారు.