ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలతో కర్ణాటక ప్రభుత్వం ఎస్‌బీఐ, పీఎన్‌బీలతో అన్ని లావాదేవీలను నిలిపివేసింది. 2013లో కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు SBIలో చేసిన రూ.10కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ ను ఆ బ్యాంక్ ఓ కంపెనీ రుణం చెల్లించేందుకు వాడుకుందని ప్రభుత్వం ఆరోపించింది. 2011లో పీఎన్‌బీలో చేసిన రూ.25 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పై సదరు బ్యాంక్ తప్పు లెక్కలు చూపినట్లు పేర్కొంది.