స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాఝీ మహిళలు, రైతులకు తీపికబురు అందించారు. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించకుని సుభద్ర యోజనను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఈ పధకం కింద మహిళలందరికీ రూ.50,000 అందచేస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న ఈ పధకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఇక వరి పంటకు క్వింటాల్‌కు రూ.3100 చెల్లిస్తామని పేర్కొన్నారు.